కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజును నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇవాళ కలిశారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఢిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశమై పలు అంశాలను ఎంపీ కవిత కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశాలను పరిష్కరించాలని కోరారు.
నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి వద్ద ఎయిర్‌పోర్టు ఏర్పాటుకై మరోసారి కేంద్ర విమానయాన శాఖా మంత్రి అశోక్ గజపతిరాజుకు ఎంపీ కవిత విజ్ఞప్తి చేశారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర కమిటీని నిజామాబాద్‌కు పంపాలని ఎంపీ కవిత కోరారు. ఆ నివేదిక ఆధారంగా సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు సానుకూలంగా స్పందించారు.