ప్రమాదాలకు, ఇతర సమస్యలకు కారణం అవుతున్న ఫ్లెక్సీలు, భారీ బ్యనర్లకు తెలంగాణ సర్కారు గట్టిగా చెక్ పెడుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ మలక్ పేట ఇండో స్టేడియం ప్రారంభం సందర్భంగా జీహెచ్‌ఎంసీ నిబంధనలకు విరుద్దంగా ఫ్లెక్సీలు కట్టడంపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫొటోతోపాటు పలువురు టీఆర్ఎస్ నేతల ఫొటోలు ఉన్న ఫ్లెక్సీలపై ఆయన కన్నెర్రజేశారు.ఈ ఫ్లెక్సీలను వెంటనే తీసేయాలని అధికారులను ఆదేశించారు. వీటిని ఏర్పాటు చేసిన కార్పొరేటర్ సునీతా రెడ్డికి రూ.50 వేలు, మాజీ కార్పొరే అస్లాంకు రూ.25 వేలు, టీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్‌కు రూ.25 వేల జరిమానా విడించాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను అధికారులను ఆయన ఆదేశించించారు.
