జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతోంది. ఇందులో భాగంగా మేడారం జాతర కోసం స్పెషల్ గా నాలుగు వేల బస్సులను నడుపాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రంలోని 50 కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపాలని నిర్ణయించారు అధికారులు. ఈ సారి జాతర సమయంలో 10 లక్షల నుంచి 12 లక్షల మంది ఆర్టీసీ సేవలు ఉపయోగించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వరంగల్, హన్మకొండ, కాజీపేటతో పాటు కరీంనగర్, మంచిర్యాల, గోదావరిఖని, పెద్దపల్లి తదితర 50 సెంటర్ల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు.
