తెలంగాణ రాష్ట్రంలోనే సిద్ధిపేట మున్సిపాలిటీ నెంబర్ వన్..రేపటి ఆదర్శవంతమైన సిద్ధిపేట నిర్మాణానికి పట్టణ ప్రజలంతా సహకరించాలని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఎల్ఆర్ఎస్ ప్రోసీడింగ్స్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. 6899 దరఖాస్తులకు 1534 దరఖాస్తులు పూర్తి చేశామని తెలిపారు. ప్రతి వారంలో 300 నుంచి 400 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుని పని చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. 3 నెలల్లో ఎలఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నదని, ప్రజల నుంచి స్పందన లభించడం లేదనే మున్సిపల్ అధికారులు చెబుతున్నారని, ఈ విషయంలో మున్సిపల్ కౌన్సిలర్లు చొరవ చూపాలని పది మందితో చెప్పి ప్రభావితం చేయాలని మంత్రి కోరారు.
