తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కార్పొరేషన్ 1 వ డివిజన్ కైకొండయిగూడెం నందు కాంగ్రెస్ పార్టీ నుండి చేపల సొసైటీ సభ్యులు 50 కుటుంబాలు అధికార టీఆర్ఎస్ పార్టీ లో చేరారు.ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రి తుమ్మల గారు, Mp పొంగులేటి గారు, Mla అజయ్ గారు మరియు ప్రజాప్రతినిధులు ఖమ్మం లో చేస్తున్న అభివృద్ధి ని చూసి స్థానిక కార్పొరేటర్ ధరవత్ రామ్మూర్తి నాయక్ గారు డివిజన్ లో కొన్నాళ్లు గా చేస్తున్న అభివృద్ధి ని చూసి పార్టీ లో చేరుతున్నట్టు వారు తెలిపారు .ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు గుర్రం వెంకట రామయ్య, డివిజన్ అధ్యక్షుడు సంపేట ఉపేందర్, కార్యదర్శి తుళ్లూరి ప్రసాద్, తేజవత్ సంగ్గం నాయక్, డా౹౹ శ్రీనివాస్, డా౹౹ పుల్లారావు, సిరికొండ నాగయ్య, అక్కి రామయ్య, వెంకటపయ్య, తేజవత్ శ్రీనివాస్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.