కువైట్‌లోని అక్రమ వలసదారులకు ఆ దేశ సర్కారు క్షమాభిక్ష పెట్టింది. ఈనెల 29 నుంచి వచ్చే ఫిబ్రవరీ 22 వరకు ఈ క్షమాభిక్ష అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ సమయంలో అక్రమంగా నివసిస్తున్న, గడువు ముగిసిన వారు ఎలాంటి అపరాధ రుసుం చెల్లించుకుండా స్వదేశానికి వెళ్లవచ్చని సూచించింది. తిరిగి సంబంధిత నియమ నిబంధనల ప్రకారం తమ దేశానికి రావచ్చునని వెల్లడించింది. కాగా, ఈ నిర్ణయంతో భారతదేశంలోని వేలాది మందికి ఉపయుక్తంగా ఉండనుంది.
ఇదిలాఉండగా కువైట్ ఎలా ఇలా అక్రమ, వీసా గడువు ముగిసిన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల మంత్రి కేటీఆర్ సూచించారు. కువైట్‌లోని భారతీయ రాయభార కార్యాలయంను కానీ లేదా తెలంగాణ ఎన్నారై విభాగాన్ని కానీ సంప్రదించాలని ఆయన కోరారు.