ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర..మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఇవాళ అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.మేడారం జాతర సమీపంలోని చిలుకల గుట్ట నుంచి గద్దెపైకి సమ్మక్క చేరుకుంది. ఈ రోజు ఉదయం పూజారి ఇంటి నుంచి పూజా సామగ్రితో అమ్మవారి మందిరానికి తరలి వెళ్లిన తర్వాత ఆడబిడ్డలు గద్దెకు ముగ్గులువేసి తిరిగి వచ్చారు. సాయంత్రం భారీ పోలీసు బందోబస్తుతో పూజారులు చిలకలగుట్టకు చేరుకొని వనంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని గద్దెపైకి తీసుకొచ్చారు. సమ్మక్క – సారలమ్మ గద్దెలపై కొలువు దీరడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
