Home / TELANGANA / కుల‌వృత్తుల‌కు పూర్వ‌వైభ‌వం..నాయీ బ్రాహ్మ‌ణుల సంక్షేమానికి రూ.250 కోట్లు

కుల‌వృత్తుల‌కు పూర్వ‌వైభ‌వం..నాయీ బ్రాహ్మ‌ణుల సంక్షేమానికి రూ.250 కోట్లు

తెలంగాణ ప్ర‌భుత్వం కుల‌వృత్తుల సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉంద‌ని రాష్ట్ర బీసీ సంక్షేమం, అటవీ శాఖ‌ల మంత్రి జోగు రామ‌న్న వెల్ల‌డించారు. అంత‌రించి పోతున్న కుల వృత్తుల‌కు పూర్వ వైభ‌వం క‌ల్పించ‌నున్న‌ట్లు ఆయ‌న స్ప‌ష్టం చేశారు. స‌చివాల‌యంలోని గ్రౌండ్ ఫ్లోర్‌ కాన్ఫ‌రెన్స్ హాల్ జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆధునిక శిక్ష‌ణ పొందిన నాయీ బ్రాహ్మ‌ణుల‌కు చెందిన 138 యువ‌తీ, యువ‌కుల‌కు కిట్స్‌, ధ్రువ‌ప‌త్రాల‌ను మంత్రి జోగు రామ‌న్న అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి జోగురామ‌న్న‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్య‌మ ప్ర‌స్థానంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప‌లు సంద‌ర్భాల్లో కుల, చేతి వృత్తుదారుల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించార‌ని, అందులో భాగంగా స్వ‌రాష్ర్టంలో వారి కోసం ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ను అమ‌లు చేస్తున్న‌ట్లు తెలిపారు. కుల వృత్తుల‌ను పూర్వ వైభ‌వం క‌ల్పించ‌డ‌మే కాకుండా చేతి వృత్తుల‌ను కాపాడుకుంటామ‌ని మంత్రి జోగు రామ‌న్న పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో బ‌ల‌హీన‌, బ‌డుగు వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం ప‌లు కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. అందులో భాగంగానే నాయీ బ్రాహ్మ‌ణుల సంక్షేమం కోసం ప్ర‌త్యేకంగా రూ.250 కోట్లు కేటాయించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. నాయీ బ్రాహ్మ‌ణులు ఆత్మ‌గౌర‌వంతో బ‌తికేందుకు వారికి ఆధునిక ప‌ద్ద‌తుల్లో వృత్తి నైపుణ్య శిక్ష‌ణను క‌ల్పిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  నాయీ బ్రాహ్మ‌ణుల‌కు అత్యాధునికి ప‌ని ముట్ల‌ను అంద‌జేస్తున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. రాష్ర్టంలో ఉన్న 3.10 ల‌క్ష‌ల మంది నాయీ బ్రాహ్మ‌ణుల సంక్షేమం కోసం ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించామ‌ని, ద‌శ‌ల వారీగా దాన్ని అమ‌లు చేస్తున్న‌ట్లు మంత్రి జోగు రామ‌న్న తెలిపారు.

see also :యూనివ‌ర్సిటీల్లో 1551 పోస్టుల భ‌ర్తీకి సీఎం కేసిఆర్ ఓకే

నాయీ బ్రాహ్మ‌ణుల వృత్తి నైపుణ్యం కోసం రూ.20 కోట్లు కేటాయించామ‌ని మంత్రి జోగు రామ‌న్న అన్నారు. శిక్ష‌ణ పొందిన 138 మంది నాయీ బ్రాహ్మ‌ణ యువ‌తీ, యువ‌కులు భ‌విష్య‌త్తులో త‌మ కాళ్ల‌పై నిల‌దిక్కుకోవాల‌న్నారు.  బీసీ వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక దృష్టిని సారించార‌ని, రానున్న బ‌డ్జెట్‌లో బీసీ వ‌ర్గాల బ‌డ్జెట్ రెట్టింపు కానుంద‌ని ఆయ‌న అన్నారు. రాష్ర్ట బీసీ సంక్షేమ బ‌డ్జెట్ రూ.5,070 కోట్లు కాగా కేంద్ర ప్ర‌భుత్వ బీసీ బ‌డ్జెట్ కేవ‌లం రూ.1,250 కోట్లు మాత్ర‌మేన‌ని ఆయ‌న విమ‌ర్శించారు. బ్యాంకు లింకేజీ లేకుండా అర్హులైన బీసీ వ‌ర్గాల‌కు నేరుగా రుణాల‌ను అంద‌జేస్తామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే వీ.శ్రీ‌నివాస్ గౌడ్‌, ఎంబీసీ కార్పొరేష‌న్ చైర్మ‌న్ తాడూరి శ్రీ‌నివాస్‌, నాయీ బ్రాహ్మ‌ణ ఫెడ‌రేష‌న్ ఎండీ చంద్ర‌శేఖ‌ర్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

see also : వైసీపీ అధినేత సంచలన నిర్ణయం ..ప్రతి తెలుగోడు కాలర్ ఎగ‌రేసే వార్త‌..

see also : తెలంగాణ ప్రభుత్వం పై ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రశంసలు..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat