Home / TELANGANA / మిషన్ భగీరథ పనులు చరిత్రలో నిలుస్తాయి..!

మిషన్ భగీరథ పనులు చరిత్రలో నిలుస్తాయి..!

తెలంగాణ ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించే మిషన్ భగీరథ పనులు చరిత్రలో నిలుస్తాయన్నారు ఆంద్రాబ్యాంకు కన్సార్షియం ప్రతినిధులు. తాము ఇప్పటిదాకా ఇలాంటి పనులను ఎక్కడా చూడలేదన్నారు. ఇవాళ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలోని భగీరథ పనులను ఆంధ్రా బ్యాంక్ నేతృత్వంలో 7 బ్యాంకు ప్రతినిధులు పరిశీలించారు. ముందుగాల కరీంనగర్ జిల్లా ఎల్.ఎం.డి దగ్గర నిర్మిస్తోన్న రా వాటర్ వెల్ పనులను, ఎల్.ఎం.డీ కాలనీలో 125 MLD సామర్థ్యంతో నిర్మిస్తోన్న వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ , పోరండ్ల GLBR , సుభాష్ నగర్ ట్రీట్ మెంట్ ప్లాంట్, ఎలగంద ప్లాంట్ పనులను పరిశీలించారు.

జిల్లా ఎస్.ఈ అమరేందర్ బ్యాంకు ప్రతినిధులకు ప్రాజెక్టు వివరాలను తెలిపారు. ఆ తర్వాత ఆ తర్వాత సిరిసిల్ల జిల్లాలోని రుద్రవరం దగ్గర నిర్మిస్తున్న ఇంటెక్ వెల్ తో పాటు అగ్రహారం 120 MLD నీటిశుద్ది కేంద్రం, రామప్పగుట్ట GLBR పనులను పరిశీలించారు. జిల్లా ఈఈ జ్ఞానకుమార్ నిర్మాణ పనుల పురోగతిని బ్యాంక్ ప్రతినిధులకు వివరించారు. ఆ తర్వాత సిరిసిల్ల మండలం ముష్టిపల్లిలో పూర్తైన ఇంట్రా విలేజ్ పనులను ఈఈ ఉప్పలయ్య బ్యాంక్ అధికారులకు చూపించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో బ్యాంక్ ప్రతినిధులు మాట్లాడారు. మిషన్ భగీరథతో తమ నీటి కష్టాలు తీరుతాయన్న ఆశాభావాన్ని గ్రామస్థులు వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో వేల కోట్ల రూపాయలను అప్పుగా తెచ్చి మంచినీటిని అందిస్తోందని, వృథా చేయకుండా వాడుకోవాలని బ్యాంక్ అధికారులు చెప్పారు. తాము ఇచ్చిన రుణానికి మిషన్ భగీరథ వంద శాతం న్యాయం చేస్తోందన్నారు.

ఈ పర్యటనలో ఆంధ్రాబ్యాంక్ ఫైనాన్స్ సీనియర్ మేనేజర్ మహ్మద్ తాహ్ సీన్ CA, పి.ఓ అమిత్ కుమార్, ఇండియన్ బ్యాంక్ ఏజీఎం ప్రభాకర్ రెడ్డి, చీఫ్ మేనేజర్ విష్ణుకుమార్, అలహాబాద్ బ్యాంక్ ఏజీఎం డిఎస్ మూర్తి, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఏజీఏం ప్రసాదరావు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చీఫ్ మేనేజర్ దేవానంద్ రెడ్డి, దేనాబ్యాంక్ మేనేజర్ అంకేష్, సిండికేట్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ కృష్ణమాచారి,మేనేజర్ సురేష్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అధికారి అరుణ్ పండిత్ లు ఉన్నారు.

కన్సార్షియం లోని బ్యాంకులు:-
ఆంధ్రాబ్యాంక్
ఇండియన్ బ్యాంక్
పంజాబ్ సింధ్ బ్యాంక్
అలహాబాద్ బ్యాంక్
దేనా బ్యాంక్
సిండికేట్ బ్యాంక్
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat