దీన్ దయాల్ ఉపాధ్యాయ్ యోజనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల సెస్ కు నిధులు కేటాయించాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె. సింగ్ ని కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ కోరారు. సిరిసిల్ల సెస్ పాలకవర్గంతో పాటు వినోద్ ఢిల్లీలో ఇవాళ కేంద్రమంత్రిని కలిశారు. వినోద్ విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. సెస్ అభివృద్ధి, పనితీరును అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే లాభాల బాటలో, విజయవంతంగా కొనసాగుతున్న సిరిసిల్ల సెస్ పనితీరుపై కేంద్రమంత్రి ఆర్.కె. సింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
