ఒకవేళ మీ తల్లిదండ్రులు మీకు స్మార్ట్ ఫోన్ కొనుక్కోమని ఒక యాబై వేల రూపాయలు ఇచ్చారు అనుకో ఏమి చేస్తారు ..తడుముకోకుండా వెంటనే యాబై వేల రూపాయల విలువ చేసే లేటెస్ట్ జనరేషన్ ఆపిల్ ఫోన్ కొంటారు లేదా దాన్ని మించికపోయిన వేరేది ఏ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్ కొని సోషల్ మీడియాలో వెంటనే స్టేటస్ పోస్టు చేస్తారు.కానీ ఒక యువకుడు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా స్పందించాడు.
పదోతరగతి చదువుతున్న సాయి విశ్రుత్ అనే విద్యార్థికి తన తల్లి దండ్రులు స్మార్ట్ ఫోన్ కొనుక్కోమని అక్షరాల అరలక్ష (యాబై వేల )రూపాయలను ఇచ్చారు.అయితే అందరిలా కాకుండా సాయి తనకిచ్చిన యాబై వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు.దీనికి సంబంధించిన చెక్ ను నిత్యం సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ తన దృష్టికి వచ్చిన సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ అవసరమైతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సాయమందించి నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల మదిలో చెరగని ముద్రవేసుకున్న ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావును కల్సి అందజేశాడు.ఈ విషయం గురించి మంత్రి కేటీఆర్ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో సాయిని అభినందిస్తూ పోస్టు చేశాడు .
Inspired by this young man Sai Vishruth Devireddy, a 10th class student. When his parents gave him money to buy a smart phone, he chose to donate the same to CMRF?
He handed over a cheque of Rs.50 thousand this morning to me? pic.twitter.com/mh2hyE9S8m
— KTR (@KTRTRS) April 24, 2018