ఉద్యోగుల సమస్యలపై సర్కార్ దృష్టి సారించింది. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చేందుకు సీఎం కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ముందుగా తానే స్వయంగా ఉద్యోగులతో ఇవాళ చర్చించాలని నిర్ణయించినా….ఆ తర్వాత మంత్రి ఈటల నేతృత్వలో కమిటీ వేశారు. ఆర్ధిక శాఖ మంత్రితో పాటు విద్యుత్ శాఖ మంత్రి జగదేశ్వర్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు కమిటీతో సెక్రటేరియేట్ లో చర్చలు జరపనున్నారు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు. కేబినెట్ మంత్రుల కమిటీని వేయటాన్ని స్వాగతించారు ఉద్యోగ సంఘాల నేతలు. మొత్తం 18 డిమాండ్లపై మంత్రులతో చర్చిస్తామన్నారు.
