నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణ హత్య జరిగింది. ప్రణయ్ అనే యువకుడిని పట్టపగలు నడి రోడ్డుపై ఓ వ్యక్తి కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనలో ప్రణయ్ మరణించాడు. 6 నెలల కిందే ప్రణయ్‌కు అమృత అనే యువతితో ప్రేమవివాహం జరిగింది. భార్య గర్భవతి కావటంతో హాస్పిటల్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఓ వ్యక్తీ ప్రణయ్ పై కత్తితో దాడిచేసి హతమార్చాడు. దీంతో భార్య షాక్ కు గురైంది.
అమృతని ప్రణయ్ ప్రేమవివాహం చేసుకోవడం యువతి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో అతనిని హత్య చేసారని ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. జిల్లా ఎస్పీ రంగనాథ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్తితిని సమీక్షిస్తున్నారు. దాడి చేసిన వ్యక్తీ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.