ముగ్గురు అమ్మాయిలు నగ్నంగా రచ్చ చేశారు.. బహిరంగంగా దుస్తులు విప్పేసి పోలీసులను పరుగులు పెట్టించారు. పోలీసులకు చిక్కకుండా కారులో పారిపోడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ ఘటన ఫ్లొరిడాలో చోటుచేసుకుంది. రెస్ట్ స్టాప్ బయట ముగ్గురు అమ్మాయిలు దుస్తులు విప్పేసి సన్‌టన్ లోషన్ రాసుకోవడాన్ని చూసిన పెట్రోలింగ్ పోలీస్ వారిని ప్రశ్నించాడు.తాము ఇప్పుడే స్నానం చేశామని, శరీరాన్ని ఆరబెట్టుకుంటున్నామని వారు సమాధానం చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో నగ్నంగా తిరగడం నేరమని, మీ వివరాలు చెప్పండని పోలీస్ అధికారి వారిని ప్రశ్నించాడు. దీంతో ఆ ముగ్గురు తెల్ల నిస్సాన్ సెన్ట్రా కారులో ఉడాయించారు. ఈ సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన మూడు పోలీస్ వాహనాల్లో వారిని వెంబడించారు. ఇలా సుమారు 33 కిమీల దూరం ఈ చేజింగ్ నడిచింది.
చివరికి పోలీసు వాహనం వారిని వెనుక నుంచి ఢీ కొట్టడంతో వారి కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రైలింగ్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత మరో రెండు పోలిసు కార్లు నేరుగా, పక్క నుంచి ఢీకొట్టాయి. ఆ తర్వాత వారు కారు నుంచి బయటకు వచ్చేందుకు నిరాకరించడంతో పోలీసులు అద్దాలు పగలగొట్టి వారిని బలవంతంగా బయటకు లాగి అరెస్టు చేశారు. నిందితులను ఒయాసిస్ షకీరా మెక్‌లియోడ్ (18), జెనియా మెక్‌లియోడ్ (19), సెసిలియా యునిక్యూ యంగ్ (19)గా గుర్తించారు.