మానవ సేవయే… మాధవ సేవా..! , అన్ని ధానాల కన్నా గొప్ప దానం అన్నదానం అని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట కేదారినాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో కేదారినాథ్ లో యాత్రలో ఉండే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఈరోజు సిద్దిపేట నుండి బయలు దేరే ఆహారపదార్థాల లారీ ని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. సిద్దిపేట అంటే సేవా కార్యక్రమాలను అందిపుచ్చుకున్న ప్రాంతం అని.. దేశంలో చార్ ధామ్ యాత్రలో అమర్ నాథ్, కేదారినాథ్ యాత్రలు ప్రత్యేక మైనవి అని..అలాంటి యాత్రకు వెళ్లే భక్తులకు అక్కడ భోజనం పెట్టె అదృష్టం సిద్దిపేట ప్రజలకు, కేదారినాథ్ సేవ సమితి కి కలిగిందన్నారు.. గతంలో అమర్ నాథ్ వెళ్లే యాత్రికులకు, ఇప్పుడు కేదారినాథ్ వెళ్లే భక్తులకు ఇలాంటి సౌకర్యం అంత దూరంలో ఏర్పాటు చేయడం అభినందనియం అని.. సేవ అలాంటి క్షేత్రాలలో భక్తులకు సేవ చేయడం అంటే భగవంతునికి సేవ చేయడం అని..మానవ సేవయే.. మాధవ సేవ అని ఈ సందర్భంగా అన్నారు.. అమర్ నాథ్ సేవ సమితి…కేదారినాథ్ సేవ సమితి సభ్యలు సామాజిక సేవ. ఆధ్యాత్మిక సేవలో భాగస్వామ్యం కావడం సంతోషకరామన్నారు.. అయ్యప్ప దేవాలయ అభివృద్ధి కి కృషి చేస్తామని…. 20ఏళ్ల స్థలానికి అయ్యప్ప స్వామి దయతో పరిష్కారం జరిగిందన్నారు.