పబ్లిక్ గార్డెన్స్ లోని సెంట్రల్ లాన్ నందు జూన్ 2వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంభందించిన ఏర్పాట్లను ఈ రోజు ఉదయం సి.పార్థ సారధి, ఐఏఎస్,ఏ.పి.సి మరియు ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ శాఖ పరిశీలించడం జరిగింది. ప్రతి నిత్యం సుమారు 15000 నుండి 20000 వరకు పాదాచారులు మరియు 5000 నుండి 6000 ప్రజానీకం సందర్శించే పబ్లిక్ గార్డెన్స్ లో పచ్చదనం పెంపోందించుటకు ఉద్యాన శాఖ చేస్తున్న కృషి, అదే విధంగా నిజాం నాటి ముఖ ద్వారాన్ని సున్నంతో ముస్తాబు చేసి సుందరికరించడం, పోకిరిలను అరికట్టుటకు సిసి కేమరాల ఏర్పాటు వంటి పనుల గురించి వారికి నివేదించడం జరిగింది. ఉద్యాన శాఖ కృషితో నూతన అందాన్ని సమకూర్చుకున్న పబ్లిక్ గార్డెన్స్ నిర్వహణకు సంభందించిన ఇబ్బందులు, నియంత్రణ లేని రాక పోకలు మరియు నిధుల కొరత గురించి తెలుసుకొన్న ముఖ్య కార్యదర్శి గారు తగిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుటకు ఆదేశించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంభందించిన ఏర్పాట్ల పట్ల ముఖ్య కార్యదర్శి సంతోషం వ్యక్తపరచి తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఉద్యాన సంచాలకులు ఎల్. వెంకట్ రామ్ రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.