ఈవీఎంలపై పూర్తి సంతృప్తితో ఉన్నామని, ఫలితాలు ఎలా వచ్చినా మేం స్వాగతిస్తామని, ఫలితాలను ప్రజాతీర్పుగా భావిస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి అన్నారు. ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లను కూడా పూర్తిగా లెక్కించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి ఈ విధంగా స్పందించారు. ఈవీఎంలపై తమకు అనుమానాలు లేవని వెల్లడించారు. ఇవాళ ఓ వార్తాసంస్థతో ఆయన మాట్లాడుతూ ఈవీఎంల పనితీరుపై తమకు సందేహాలు లేవన్నారు.
