ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష తర్వాత పలువురు మంత్రులతో కలిసి సీఎం భాగ్యనగరానికి పయనమయ్యారు. శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జగన్ ప్రగతిభవన్‌లో భేటీ కానున్నారు. విభజన చట్టంలోని ఉమ్మడి అంశాలపై ఇద్దరు సీఎంలూ చర్చించనున్నారు. వివాదాస్పద అంశాలు, నదీ జలాల పంపకం, ఇతర అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది.
