మై హోమ్ చైర్మన్ రామేశ్వర రావు గారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు.. తాజా పరిణామాలపై స్వామివారితో ఆయన మాట్లాడారు. స్వామివారికి పాదాలకు నమస్కరించి తనను ఆశీర్వదించాలని కోరారు. స్వామివారు ఆయనకు ఆశీర్వచనం అందించారు. ప్రేమగా పలకరించారు. మరింత ఎత్తుకు ఎదగాలని ఆశీర్వదించారు. స్వామివారు ప్రేమ నమ్మకం ఉన్నవారిని తన ముఖానికి హత్తుకుని, ముఖస్పర్శతో ప్రేమగా ఆశీర్వచనం అందిస్తారు. ఇలా స్వామివారి ఆశీర్వచనం అందుకోవడం తమ పూర్వజన్మల సుకృతంగా భావిస్తుంటారు..రామేశ్వర రావు చేసే ప్రతీ ప్రయత్నం కూడా సఫలం అవ్వాలని స్వామివారు ఆశీర్వదించారు.
