Home / TELANGANA / ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి.. మంత్రి తలసాని

ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి.. మంత్రి తలసాని

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. జులై 9వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం నేపథ్యంలో ఇవాళ ఆలయంలో కల్యాణం ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. అమ్మవారి కల్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఆలయ పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను, పోలీసులను ఆదేశించినట్లు మంత్రి తలసాని తెలిపారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat