తెలంగాణ ,నవ్యాంధ్ర రాష్ట్రాల నిరుద్యోగ యువతకు శుభవార్త. సర్కారు నౌకరి కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న యువతకు ఇది శుభపరిణామం. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడుతూ”తెలంగాణ రాష్ట్రంలో ముప్పై వేలు,నవ్యాంధ్ర రాష్ట్రంలో పదిహేడు వేలకుపైగా పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని”తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”నవ్యాంధ్రలో మొత్తం 72,176మందికి కేవలం 54,243మంది పోలీసులే ఉన్నారు అని ఆయన ప్రకటించారు. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే 76,407మందికి అతితక్కువగా 46,062మంది మాత్రమే ఉన్నారు అని కిషన్ రెడ్డి తెలిపారు. అయితే దేశ వ్యాప్తంగా మాత్రం మొత్తం ఐదు లక్షల పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన అన్నారు.
