హరిత తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నేడు పాలకుర్తి మండల కేంద్రంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఒక్కో మండలానికి రెండు కోట్ల రూపాయల పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. ఎన్నికల హామిలో భాగంగా పెన్షన్లు పెంచి సీఎం కేసీఆర్ ఇచ్చన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందిందన్నారు. రైతులకు 24గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్దే నా లక్ష్యం…నామీద నమ్మకంతో నన్ను గెలిపించిన పాలకుర్తి ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు.
