ఈనెల 24న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు తన అభిమానులకు ఒక విజ్ఞప్తి చేశారు..
‘24 జరగనున్న నా పుట్టనరోజు సందర్భంగా పార్టీ క్యాడర్, నేతలకు నేతలకు నేనొక మనవి చేస్తున్నాను. దయచేసి హోర్డింగులు, బొకేలకు అనవసర ఖర్చులు చేయవద్దని కోరుతున్నాను. ఓ చిన్న చిరునవ్వు నవ్వినా చాలు.. అదే పెద్ద గిఫ్ట్ అవుతుంది. అనవసర ఖర్చులు చేసేకన్నా ఆ డబ్బుతో మీరు ఆపదలో వున్నవారికి సాయపడండి. దాంతో వారి మెుఖాల్లో ఆనందాన్ని నింపండి’ అని ట్వీట్ చేశారు కేటీఆర్. ఆయన ట్వీట్‌పై యూజర్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.
On the eve of my birthday on 24th, appeal to TRS party cadre & leaders not to splurge money on advertisements, hoardings, bouquets. Instead do something meaningful even if it’s a small gesture ?#GiftASmile if you can ? Help someone in need & bring a smile to their face
— KTR (@KTRTRS) July 22, 2019