మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గన్ ఫౌండ్రి, గౌలిగూడ ప్రాంతాలలో బస్తి దావా ఖానాలను మంగళవారం లాంఛనం గా ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సౌకర్యం అందించేందుకు బస్తి దావా ఖానాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యం గా పేద ప్రజలు బస్తి దావా ఖానా లకు విచ్చేసి తమ ఆరోగ్య సమస్యల గూర్చి వైద్యులకు తెలిపి తగిన చికిత్స చేయించుకోవాలన్నారు. ఇప్పటికే నగరం లో వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన బస్తి దావా ఖానా లు ఏర్పాటు చేయగా మంచి ఆదరణ వస్తుందని తెలిపారు .ప్రభుత్వం బస్తి వాసులకు వైద్య సౌకర్యం అందించేందుకు ఏర్పాటు చేసిన దావా ఖానా లను ప్రజలు సద్వినియోగ పరచుకోవాలన్నారు. బషీర్ బాగ్ ప్రాంతంలో గల ఫ్యూల్ బాగ్ లో మంత్రి పర్యటించి నిర్మించిన జె ఎన్ ఎన్ యూ ఆర్ ఎం ఇళ్లను పరిశీలించారు .స్థానికులు 2011 లో నిర్మాణపు పనులు చేపట్టే ముందు నివసించిన వారికే ఇళ్లను కేటాయించాలని మంత్రి కి విన్నవించుకున్నారు .మంత్రి సానుకూలంగా స్పందిస్తూ మొదటి జాబితా ప్రకారమే ఇళ్ల ను కేటాయించాలని హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ ను ఆదేశించారు .ఇళ్ల ను స్థానికులకు కేటాయించాక ఆ ప్రాంతంలో నివాసయోగ్యం గా ఉండేందుకు కావలిసిన మౌలిక సదుపాయాలు కలిపించాలని మంత్రి సంబంధిత అధికారులకు ఆదేశించారు . స్థానికులకు కాకుండా స్థానికేతరులకు ఇళ్ల ను ఎట్టి పరిస్థితులలోను కేటాయించవద్దు అన్నారు.
