ఉమ్మడి ఖమ్మం జిల్లావాసులకు శుభవార్త. ఖమ్మంలో దశాబ్దాలుగా పేదలకు వైద్య సేవలందిస్తోన్న ప్రభుత్వాసుపత్రి త్వరలో వైద్య కళాశాలగా మారనుంది. దేశవ్యాప్తంగా 75 ప్రభుత్వాసుపత్రులను వైద్య కళాశాలలుగా తీర్చిదిద్దే క్రమంలో కేంద్రం రూపొందించిన జాబితాలో ఖమ్మం ఆస్పత్రికి చోటుదక్కింది. వైద్య కళాశాల ఏర్పాటుకు అన్ని సానుకూలతలూ ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. వైద్య కళాశాల ఏర్పాటు విషయమై ప్రభుత్వం త్వరలోనే ప్రకటన చేయనుంది. ఖమ్మంతోపాటు కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిని కూడా వైద్య కళాశాలగా మార్పు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ రెండు ఆస్పత్రులు కూడా 400 పడకల ఆస్పత్రులు కావడం, వాటి పరిధుల్లోని జనాభా ప్రాతిపదికలన కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
