గత ఏడాది శ్రీసప్తముఖ కాలసర్ప మహాగణపతిగా వెలిసిన హైదరాబాద్ ఖైరతాబాద్ గణనాథుడు ఈసారి ‘ద్వాదశ ఆదిత్య మహాగణపతి’ అలంకారంలో దర్శనం ఇవ్వనున్నాడు. 61 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పు, 50 టన్నుల బరువుతో ఖైరతాబాద్ గణనాథుడు పూజలకు సిద్ధమయ్యాడు. మహా గణపతి విగ్రహ పనులన్నీ ఇప్పటికే పూర్తి అయ్యాయని గణేష్ ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. సోమవారం ఉదయం తొలి పూజ జరగనుందని అన్నారు. ఇంకా పండగకు రెండు రోజులు వున్నా భక్తులు అప్పుడే ఖైరతాబాద్కు వచ్చి మహా గణపతి దర్శనం చేసుకుంటున్నారు. దీంతో నగర పోలీసులు అక్కడ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశారు.
