నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో జ్వరంతో బాధపడుతున్న రోగులను మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. వైద్యులతో కలిసి వార్డలన్నీటిని పరిశీలించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న చికిత్స గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. “వర్షాకాలం లో కలుషిత నీరు, దోమల వల్ల జ్వరాలు వస్తున్నాయి. గత మూడు నెలలుగా వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల మెరుగైన చికిత్సను అందించగలుగుతున్నం. 2017 తో పోలిస్తే డెంగీ జ్వర తీవ్రత తక్కువగా ఉంది. ప్లేట్ లెట్స్ సంఖ్య కూడా గణనీయంగా తగ్గడంతో లేదు. కేవలం 5 శాతం మందిలో మాత్రమే ప్లేట్ లెట్స్ ఎక్కించల్సిన అవసరం వచ్చింది. ప్రస్తుతం వస్తున్న జ్వరాల్లో 80 శాతం సాధారణ వైరల్ జ్వరాలు మాత్రమే. కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల డెంగీ ని ముందే గుర్తించ గలుగుతున్నము. డెంగీ పరీక్షలు చేసే సెంటర్ల సంఖ్యను పెంచినం పరీక్షలు చేయడానికి అవసరమైన అన్ని పరికరాలను అందుబాటులో ఉంచాం. ఆగస్ట్ నెలలో 700 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ ఇప్పటి వరకు డెంగీ వల్ల ఒక్కరు కూడా చనిపోలేదు “అని అన్నారు.
