Home / TELANGANA / మహిళా, శిశు సంక్షేమంలో రాష్ట్రాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతాం..!!

మహిళా, శిశు సంక్షేమంలో రాష్ట్రాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతాం..!!

మహిళా, శిశు సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. ఈ రోజు మహిళా, శిశు- సంక్షేమ శాఖ కమిషనరేట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో నమ్మకంతో గిరిజన మహిళ అయిన నాకు మహిళా, శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖలు ఇచ్చి గురుతర బాధ్యతను అప్పగించారు. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వం ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ ఆలోచించి మన తెలంగాణ రాష్టంలో అమలు చేస్తున్నారు. వీటికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. శిశువు కడుపులో పడ్డప్పటి నుంచి తల్లి, బిడ్డల ఆరోగ్యం కోసం, ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పెళ్లయ్యే వరకు అన్ని రకాలుగా ఆదుకునే పథకాలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. మాతా- శిశు ఆరోగ్య రక్షణలో సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ప్రతి పథకాన్ని క్షేత్ర స్థాయిలో లబ్దిదారులకు అందించేలా అందరం కలిసి కట్టుగా పనిచేద్దాం. ఈ శాఖలో పని చేసే వారికి హోదాలు ముఖ్యం కాకుండా..మనసుతో పనిచేసే తత్వం ఉండాలి. ఇక్కడ చిన్న పిల్లలు, మహిళలు అనేక సమస్యల్లో ఉండి మన దగ్గరకు వచ్చినపుడు మనసుతో పనిచేసి వారికి పరిష్కారం చూపాలి. దేశం మొత్తంలో అంగన్వాడీ ఉపాధ్యాయులకు అత్యధిక వేతనాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోనే చెల్లిస్తున్నాం. కేంద్రం నుంచి రావాల్సినన్ని నిధులు రాకున్నా…రాష్ట్ర ప్రభుత్వమే వాటిని భరిస్తూ మహిళలు, శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు 60 శాతం నిధులు కేంద్రం నుంచి, 40శాతం నిధులు రాష్ట్ర వాటా గా ఇవ్వాల్సి ఉంటే…తెలంగాణలో 70శాతంకి పైగా నిధులు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. చనుపాల ప్రాధాన్యత పై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మహిళా, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన రేడియో ప్రకటనలను ఈ సందర్భంగా మంత్రి ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు ఇంటింటికి అంగన్వాడీ పేరుతో పోషకాహార లోపాన్ని తగ్గించే కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో భాగంగా సెప్టెంబర్ నెలను పోషన్ అభియాన్ మాసంగా ప్రకటించి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పోషన్ అభియాన్ లో రాష్ట్రం చేపడుతున్న కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో 4 అవార్డులు రావడం అభినందనీయం. మొత్తంగా అందరం కలిసి రాష్ట్రంలోని మహిళలు, శిశువులకు ఈ శాఖ ద్వారా సరైన న్యాయం జరిగే విధంగా పనిచేద్దాం. తద్వారా దేశంలో మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొద్దాం.సమావేశం అనంతరం అక్కడున్న శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. అమ్మగా అక్కడి శిశువులని దగ్గరికి తీసుకొని వారికి ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని, ఉద్యోగులుగా కాకుండా తల్లుల్లా పని చేయాలని కోరారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat