హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెల్లచెరువు మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ అధికారంలోకి రావడం వల్లనే ఇన్ని సంక్షేమ పథకాలు పురుడుపోసుకున్నాయి. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐదేళ్లు మంత్రిగా పని చేసింది శూన్యం. ఆంధ్రా సీఎంల వద్ద మోకరిల్లి మంత్రి పదవులు పొందిన సంస్కృతి ఉత్తమ్ కుమార్ దని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టి పదవుల కోసం పెదవులు మూసుకున్న నీచ సంస్కృతి ఉత్తమ్ కుమార్ రెడ్డిదని విమర్శించారు. హుజూర్ నగర్ ప్రజలను ఉత్తమ్ కుమార్ నిలువునా మరో సారి మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. హుజూర్ నగర్ లో ఉత్తమ్ చేయని ఆగడాలు లేవు. ఇప్పుడు ఇక ఉత్తమ్ ఆటలు సాగవు. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి తాతలు, తండ్రులు హుజుర్ నగర్ నియోజకవర్గ వాసులే. సైదిరెడ్డి ది ఆంధ్ర ప్రాంతం అంటూ ఉత్తమ్ బోగస్ ప్రచారానికి తెర లేపిండు. అధికారం కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగజారి మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. అభివృద్ధి కోరుతూ హుజూర్ నగర్ ప్రజలంతా గులాబీ జెండా వైపు నడుస్తున్నరు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఉత్తమ్ కుటుంబానికి లాభం. టీఆర్ ఎస్ గెలిస్తే హుజూర్ నగర్ ప్రజలకు లాభమని, ప్రజలంతా ఆలోచన చేయాలని కోరారు.
