రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు ఇవ్వాలని యునెస్కో ప్రతినిధులను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కోరారు. రామప్ప ఆలయ విశిష్టత, చరిత్ర, శిల్ప కళావైభవాన్ని తెలియజేసే డాక్యుమెంటరీని యునెస్కో ప్రతినిధి వాసు పోష్యనందన్ కు అందజేశారు. ఇప్పటికే రామప్ప ఆలయాన్ని యునెస్కో ప్రతినిధులు పరిశీలించారు. తుది నివేదికను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప గుడిని గుర్తించాలని పోచంపల్లి కోరారు.
