Home / TELANGANA / హైవేలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు..మంత్రి వేముల

హైవేలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు..మంత్రి వేముల

అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రంలో వన్ నేషన్-వన్ ట్యాగ్ పై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఢిల్లీలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సహాయమంత్రి వీకే సింగ్, తెలంగాణ రాష్ట్రం తరపున మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గోన్నారు. ఈసందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. టోల్ ప్లాజాలలో ఎక్కువ సమయం వెచ్చించకుండ.. ఇంధనం కూడా ఆదా అయ్యేలా కొత్త విధానం ఉపయోగపడుతుంది. రాష్ట్రాల ఆధ్వర్యంలో ఉన్న హైవేలపై ఎలక్ట్రానిక్ టోల్ ప్లాజాలుగా మార్చాలని చెప్పారు. ఆ అంగీకారానికి తెలంగాణ రాష్ట్రం తరపున ఒప్పుకున్నట్లు తెలిపారు. టోల్ ప్లాజాలలో ఈ ఫాస్ట్ ట్యాగ్ విధానంతో పారదర్శకత వస్తుందన్నారు. తెలంగాణ నేషనల్ హైవే లపై ఉన్న ఇబ్బందులు, పెండింగ్ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాము. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ కృషి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహకారంతో జాతీయ రహదారుల ఎక్కువగా మంజూరు అయ్యాయి.3,150 కిలో మీటర్లు అదనంగా ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకుంది. 1380 కిలోమీటర్లకు నంబరింగ్ ఇవ్వడం జరిగింది.. మిగతా వాటికి నంబరింగ్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. 50శాతం భూసేకరణలో రాష్ట్రం భరిస్తుందని చెప్పినం.. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. ఈ ఏడాది హైవేల నిర్వహణకు 270 కోట్లే బడ్జెట్ లో పెట్టారు.. దానిని 2వేల కోట్లకు పెంచాలని కోరినం..అన్ని సమస్యలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat