2020 ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు తెలంగాణలో ‘బయో ఆసియా-2020’ సదస్సు జరుగనున్నది. హైద్రాబద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. రేపటి కోసం నేడు అనే థీమ్‌తో ఈ సదస్సు జరుగనుంది. ఈ రోజు దీనికి సంబంధించిన వెబ్‌సైట్, లోగో, థీమ్‌ను ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఇది 17వ బయోఆసియా సదస్సు కావడం విశేషం. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గతంలో చాలా అంతర్జాతీయ కార్యక్రమాలకు హైదరాబాద్ వేదికైన విషయం తెలిసింది. హైదరాబాద్ అంతర్జాతీయ సదస్సులకు వేదికవడం సంతోషదాయకమని అన్నారు. అలాగే ఈ ‘బయో ఆసియా-2020’ సదస్సును విజయవంతంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, బయో ఆసియా సీఈవో శక్తినాగప్పన్, తదితరులు పాల్గొన్నారు.
Minister @KTRTRS today unveiled the theme (#TodayforTomorrow) and website of Telangana’s flagship life sciences convention, @BioAsiaOfficial (https://t.co/KFZBl2UCsA) to be held from Feb 17-19, 2020 in HICC, #Hyderabad (1/2) pic.twitter.com/udjp5hck0b
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 16, 2019