ప్రశాంత వాతావరణంలో హుజూర్నగర్ ఉప ఎన్నికల పోలింగ్ జరిగిందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. పోలింగ్ అనంతరం మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం ఖాయమని పేర్కొన్నారు. ఓటింగ్‌లో పాల్గొన్న ప్రజలకు ధన్యవాదాలు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారు. సీఎం కేసీఆర్ నాయకత్వంపై ప్రజలు విశ్వాసం ఉంచారు. హుజూర్నగర్ నియోజకవర్గం ప్రజలు అత్యధిక ఓటింగ్‌తో స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు మద్దతుగా ఈ భారీ పోలింగ్ జరిగిందన్నారు. ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడమే నిజమైన ప్రజాస్వామ్యానికి అద్దం పడుతుందన్నారు. పెరిగిన ఓటింగ్ శాతం ప్రభుత్వ సానుకూల భావనకు నిదర్శనమని, టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపును ఖాయం చేస్తోందని అభిప్రాయపడ్డారు
