దీర్ఘకాలంగా నగర రోడ్ల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వినూత్నమైన కసరత్తు చేపట్టనున్నది. ఇందుకోసం జియచ్ యంసి సరికొత్త కార్యక్రమం చేపట్టనున్నది. కాంప్రెహెన్సీసివ్ రోడ్ మెయిటెనన్స్ (CRM) పేరుతో ప్రత్యేక కార్యక్రమం తీసుకుని, నగరంలోని ప్రధాన రోడ్ల నిర్వహాణ చేపట్టనున్నది. ప్రస్తుతం రోడ్ల నిర్వహాణతో పాటు పుట్ పాత్ నిర్మాణాలను వేర్వేరుగా నిర్వహిస్తున్నది. అయితే రోడ్లతోపాటు పుట్ పాత్ నిర్వహణ, రోడ్ల క్లీనింగ్, గ్రీనరీ నిర్వహాణ వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని వీటన్నింటిని ఏకకాలంలో నిర్వహించేలా నిబంధనలు రూపొందిస్తున్నది. సుమారు ఐదు సంవత్సరాలపాటు అత్యుత్తమ ప్రమాణాలతో వీటి నిర్వహాణను చేసేందుకు జియచ్ యంసి కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం రోడ్ల నిర్వహాణ కోసం జియచ్ యంసి ప్రయివేట్ కాంట్రాక్టర్లకు అప్పజెప్పుతూ వస్తున్నది. ఇందులో భాగంగా గుంతలు పూడ్చడం, నూతనంగా లేయర్ రోడ్లను వేయడం వంటి కార్యక్రమాలకు వేర్వేరుగా టెండర్లు పిలుస్తున్నది. ఈ విధానంలో వర్కింగ్ ఏజెన్సీల మద్య సమన్వయ లోపంతో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. దీంతోపాటు పాడయిన రోడ్లను గుర్తించడం, వాటి నిర్వహాణ అంచనాలు తయారు చేయడం, టెండర్లు పిలవడం వంటి వివిధ ప్రక్రియలకు సమయం పడుతున్నది. ఈ నేపథ్యంలో నగరంలోని ప్రధాన రహదారులను గుర్తించి వాటి నిర్వహణ నిమిత్తం ఐదు సంవత్సరాల కోసం టెండర్లు పిలవనున్నది. టెండర్లు దక్కించుకున్న సంస్ధలు జియచ్ యసి నిర్ణయించిన ప్రమాణాల మేరకు రోడ్లను నిర్వహించాల్సి ఉంటుంది. రోడ్డు గుంతలతోపాటు, అవసరం అయిప్పుడు నూతనంగా రోడ్లు వేయడం అయా సంస్ధలే చేయాల్సి వస్తుంది. దీంతోపాటు మీడీయన్ల గ్రీనరీ, రోడ్ల క్లీనింగ్, పుట్ పాత్ నిర్మాణం, నిర్వహణ పూర్తి భాద్యత వర్కింగ్ ఏజెన్సీలదే. దీంతోపాటు ఈ 5 సంవత్సరాలపాటు ట్రాన్స్ కో, జల మండలి, ప్రయివేట్ సంస్ధలు మాస్టర్ ప్లాన్ విస్తరణ వంటి అవసరాలకు రోడ్లు తవ్వేందుకు వర్కింగ్ ఏజెన్సీలే సహకరిస్తాయి. అయితే అయా సంస్ధలు తమ భవిష్యత్తు ప్రణాళికలను కనీసం 6 నెలల ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది. ఈ విధంగా నూతనంగా వేసిన రోడ్లను, పుత్ పాత్ లను వెంటనే తవ్వే అవసరం ఉండదు. దీంతోపాటు ఎప్పుడైన రోడ్లను తవ్వితే వాటినే వెంటనే పూడ్చి, తిరిగి యాథాతధ స్దితికి తేవడంలోనూ ప్రస్తుతం వివిధ శాఖల మద్య ఉన్న సమన్వయం లోపం, ఆలస్యం ఉండదు. దీంతోపాటు అయిదు సంవత్సరాలపాటు అదే సంస్ధపైన నిర్వహాణ భాద్యత ఉండనున్న నేపథ్యంలో పనుల్లో దీర్ఘకాలం మన్నేలా ప్రమాణాలు ఉండే అవకాశం ఉండే అవకాశం ఉన్నది.
ప్రస్తుతం ఈ కాంప్రహెన్సివ్ రోడ్లు మెంటెనెన్సు (CRM) కార్యక్రమం కింది 709 కిలోమీటర్ల రోడ్లను 7 యూనిట్లుగా విభజించి దీర్ఘకాలిక టెండర్లను జియచ్ యంసి పిలవనున్నది. ఈ మేరకు జియచ్ యంసి ఇంజనీరింగ్ సిబ్బంది, జోనల్ కమీషనర్లతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జియచ్ యంసి ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అయా జోన్లలోని ప్రధాన రోడ్లను గుర్తించి సిఅర్ యం కార్యక్రమంతో వాటిని నిర్వహించనున్నట్లు జియచ్ యంసి అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్ల నిర్వహణతోపాటు ఇతర అంశాల్లోనూ ఉన్నత ప్రమాణాలను నిర్ధేశించినట్లు, అయా వర్కింగ్ ఏజెన్సీలు చేసే పనుల నాణ్యతపైనా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని ఇంజనీరింగ్ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా దీర్ఘకాలంగా ప్రధాన రోడ్ల నిర్వహణకు ఎదురవుతున్న సవాళ్లు తొలగిపోతాయాన్న అశాభావం వారు వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహాన్ తోపాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కూమార్, జియచ్ యంసి కమీషనర్ లోకేష్ కూమార్, జోనల్ కమీషనర్లు, ఇంజనీరింగ్ సిబ్బంది, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.