కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. గ్రేడ్ ఏ రకం వరికి రూ.1835, సాధారణ వరి ధాన్యానికి రూ.1815గా మద్దతు ధర నిర్ణయించామని మంత్రి తెలిపారు. వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే ఆరబెట్టుకుని కొనుగోలు సెంటర్లకు తీసుకురావాలని సూచించారు. వరి కోతల సమయంలో వర్షాలు పడుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తేమ శాతం తక్కువ ఉన్న ధాన్యాన్ని ఆరబెట్టాలన్నారు. సబ్సిడీ ద్వారా వచ్చే తాటిపత్రులను రైతులు కొనుగోలు చేసుకోవాలన్నారు. 212 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని మున్ముందు అవసరాన్ని బట్టి కొనుగోలు కేంద్రాలు పెంచుతామని వివరించారు.