ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సిగ్గుపడాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఘోరాలు జరుగుతున్న చర్యలు తీసుకోవడంలో.. నిందితులను పట్టుకోవడంలో యోగి ప్రభుత్వం విఫలమైంది అని ఆమె ఆరోపించారు. అధికారం కోసం ఎన్నో వాగ్ధానాలు,హామీలు కురిపించిన సీఎం యోగి వాటిని అమలు చేయడం లో .. మహిళలకు రక్షణ కల్పించడం లో విఫలమయ్యారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో.. పాలనలో విఫలమైనందుకు సీఎం యోగి సిగ్గుతో ముఖ్యమంత్రి పదవీకి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న నేరాలపై జాతీయ నేర నమోదు విభాగం రిపోర్టు విడుదల చేసింది. ఇందులో 2017లో మహిళలపై జరిగిన 3,59,849 కేసుల్లో యూపీ 56,011కేసులతో మొదటి స్థానంలో నిలిచిందని ఆమె విమర్శించారు.
