సూర్యాపేట జిల్లా రైతులకు సీఎం కేసీఆర్ దీపావళి కానుకగా గోదావరి జలాలను ఇచ్చారని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. గోదావరి జలాలు సూర్యాపేట జిల్లాలు చేరుకున్న సందర్భంగా పెన్ పహాడ్ మండలంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు మంత్రి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పోయిన దీపావళి నాడు చెప్పిన మాట ప్రకారం గోదావరి జలాలు సూర్యాపేట జిల్లాకు తెచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అన్న ఆయన.. కృష్ణా, గోదావరి జలాలతో జిల్లా సస్యశ్యామలం అయ్యిందన్నారు. ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణ అతి త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు.
