వరంగల్ మహానగరం సమగ్ర అభివద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ నగరం కొత్త మాస్టర్ ప్లాన్ చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని చెప్పారు. భవిష్యత్తు తరాల అవసరాలను తీర్చడం లక్ష్యంగా, వరంగల్ మహానగరం సరికొత్త తరహాలో అభివద్ధి జరిగేలా ‘వరంగల్ మాస్టర్ ప్లాన్– 2041’ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా, నగరంలో మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా మాస్టర్ ప్లాన్‌ను ఉంటుందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, ప్రజల సూచనలను పరిగణలోకి తీసుకుని అన్ని అంశాలను మాస్టర్ ప్లాన్ లో చేర్చినట్లు వివరించారు.
వరంగల్ మాస్టర్ ప్లాన్–2041 పై మంత్రి ఎరబ్రెల్లి దయాకర్‌రావు బుధవారం వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, పార్లమెంట్ సభ్యులు బండ ప్రకాశ్, పసునూరి దయాకర్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్‌పాటిల్, ఎం.హరిత, కుడా వైస్ చైర్మన్ రవికిరణ్, కుడా పీవో అజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వచ్చే దశాబ్దంలో అభివద్ధి పరంగా వరంగల్ నగరం సరికొత్త పుంతలు తొక్కాలని… ఆ దిశగా మాస్టర్ ప్లాన్, నగర అభివద్ధి ప్రణాళిక ఉండాలని మంత్రి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ మాస్టర్ ప్లాన్ రూపకల్పన పూర్తయ్యిందని, త్వరలోనే వరంగల్ వాసులు శుభవార్త వింటారని చెప్పారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్‌కు మాస్టర్ ప్లాన్‌ను వివరించి త్వరలోనే ప్రభుత్వం ఆమోదం పొందేలా జిల్లాలోని జిల్లాలలోని ప్రజాప్రతినిధులు అందరం కలిసి ప్రయత్నిస్తామని తెలిపారు. ‘తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం వరంగల్. చారిత్రక ప్రాధాన్యత ఉన్న వరంగల్ మహానగరం అభివద్ధి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు. వరంగల్ నగరం అభివద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. అభివద్ధిలో కీలకమైన మాస్టర్ ప్లాన్ సమగ్రంగా ఉండాలని మున్సిపల్ మంత్రి కేటీఆర్ సూచించారు. వరంగల్‌కు ఉన్న చారిత్రక ప్రాధాన్యతను పెంచేలా, నగరాన్ని పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేసేలా మాస్టర్ ప్లాన్‌లో అంశాలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 27 నగరాల్లో అధ్యయనం చేసి మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరుగుతోంది. మాస్టర్ ప్లాన్ ఆమోదంతో వరంగల్ నగర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రస్తుతం వ్యవసాయ, పారిశ్రామిక ప్రాంతాలుగా ఉన్నవి మాస్టర్ ప్లాన్ ఆమోదం తర్వాత నివాస ప్రాంతాలుగా మారుతాయి. వరంగల్ నగరం మౌలిక వసతుల కల్పన వేగవంతం అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్‌రోడ్డు, గ్రోత్‌కారిడార్లు, స్పోర్ట్స్ జోన్, గ్రీన్ జోన్, ఇండస్ట్రీయల్ జోన్, ట్రక్ పార్కులతోపాటు ఎయిర్ పోర్టు అభివద్ధికి మాస్టర్ ప్లాన్‌లో చేర్చాం. ప్రస్తుతం 80 చదరపు కిలో మీటర్ల పరిధిలోనే మాస్టర్ ప్లాన్‌లో ఉంది. కొత్త మాస్టర్ ప్లాన్‌తో ఈ పరిధి 1800 చదరపు కిలో మీటర్లకు పెరుగుతుంది. పర్యావరణ పరిరక్షణకు మాస్టర్ ప్లాన్‌లో పెద్ద పీట వేశాం. చెరువులు, ఇతర జలవనరుల సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చాం. మహానగరం అభివద్ధిలో కీలకమైన మాస్టర్ ప్లాన్‌పై ప్రజల నుంచి 3800 సూచనలు వచ్చాయి. వీటన్నింటితోపాటు ప్రజాప్రతినిధులు సూచనలు పరిగణలోకి తీసుకున్నాం. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి ప్రజల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని పరిష్కరించడం జరిగింది’ అని వివరించారు. కుడా బలోపేతంపైనా మంత్రి దయాకర్‌రావు అధికారులకు పలు సూచనలు చేశారు.
‘వరంగల్ నగరం అభివద్ధికి కాకతీయ పట్టణాభివద్ధి సంస్థ(కుడా) పెద్ద బలంగా ఉండాలి. కుడా ఆర్థికంగా అనుగుణంగా బలోపేతం కావాలి. సొంతంగానే వరంగల్ నగరం అభివద్ధి చెందేలా కుడా ప్రణాళికలు ఉండాలి. హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ తరహాలో కుడా కొత్తగా అభివద్ధి ప్రాజెక్టులు చేపట్టాలి. ప్రభుత్వ భూములను గుర్తించి వెంచర్లను అభివృద్ధి చేయాలి. ఎక్కువ ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలి’ అని మంత్రి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు.