హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తనను అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నట్లు ఎమ్మెల్యే సైదిరెడ్డి తెలిపారు. ఈ ఎన్నిక హుజూర్ నగర్ అభివృద్ధి కోసం జరిగిన ఎన్నిక అని, అభివృద్ధి జరగాలంటే టిఆర్ఎస్ గెలవాలని ప్రతి ఒక్కరూ భావించారని సైదిరెడ్డి అన్నారు. తన గెలుపు కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి సహకారంతో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటానన్నారు. ప్రజల ఆశీర్వాదం పొందేలా..అందరి మన్ననలు పొందేలా పని చేస్తానని ఎమ్మెల్యే సైదిరెడ్డి స్పష్టం చేశారు.