జనసేన అధినేత,ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ పై ఏపీ అధికార పార్టీ వైసీపీ నేత,మంత్రి అవంతి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఒక ఫ్యాకేజీ స్టార్. లాంగ్ మార్చ్ నిర్వహించిన అతనికి ఎవరో రెమ్యూనేషన్ ఇస్తారు. నిజంగా భవన కార్మికులను ఆదుకోవాలంటే ..వారిపై ప్రేమ ఉంటే చేయాల్సింది లాంగ్ మార్చ్ కాదు. పవన్ కళ్యాన్ ఒక మూవీ తీసి అందులో తనకు వచ్చిన రెమ్యూనేషన్ భవన కార్మికులకు ఇవ్వాలని” సూచించారు. భవన కార్మికులు ఇబ్బంది పడకూడదనే తమ ప్రభుత్వం వారాంతం పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. వారం తర్వాత ఇలాంటి సమస్యలుండవు. ప్రస్తుతం ఎక్కడ చూసిన నిండుగా నీళ్లుండటం వలన ఇలాంటి సమస్యలు పునరావృత్తమవుతున్నాయి. నిజనిజాలు తెలుసుకోని పవన్ మాట్లాడితే బాగుంటుంది. అప్పుడు ప్రజలే ఆదరిస్తారు అని ఆయన అన్నారు.
