మంగళవారం హైదరాబాద్ మహానగరంలోని గాంధీభవన్ లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ సమావేశంలో గందరగోళం నెలకొంది. సీనియర్ కాంగ్రెస్ నేతలు పరస్పరం దూషించుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత గులాంనబీ ఆజాద్ సమక్షంలో కాంగ్రెస్ నేతలు విహెచ్, షబ్బీర్ అలీలు పరస్పరం దూషించుకోవడంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. పార్టీలో సీనియర్ నేతలకు న్యాయం జరగడం లేదని విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవారికే కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విహెచ్ సమావేశం మధ్య నుంచే వెళ్లిపోయారు. ఆజాద్ జోక్యం చేసుకుని సమస్యను సద్దుమణిపించారు. ఇదిలా ఉండగా విహెచ్ పై వ్యాఖ్యలు చేసే అవసరం తనకు లేదని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.
