బుధవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జేపీ దర్గాను మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, షాదనగర్ ఎమ్ఎల్ఏ ఆంజయ్య యాదవ్, ఏకె ఖాన్ లతో కలిసి సందర్శించారు. అనంతరం దర్గా అభివృద్ది పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ..వివిధ ప్రాంతాలనుండి జహంగీర్ ఫిర్ దర్గా వచ్చే ప్రజలకు ( భక్తులకు ) ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 40 ఎకరాల్లో 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు గాను రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను మంత్రులు పరిశీలించారు. పార్కింగ్, బస్టాప్, మజీద్, దర్గా తదితర నిర్మాణానికి సంబంధించిన పనులను చేపట్టాలన్నారు. అందరి సహకారంతో పనులను వచ్చే మాసంలో పనులను చేపట్టాలన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 22 కోట్లతో రోడ్ల పనులు చేపట్టనున్నారని, అన్ని మతాల వారు ఈ ప్రాంతాన్ని సందరిస్తారని అన్నారు.
కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రాంతం రంగారెడ్డి జిల్లా అని, ఈ ప్రాంతానికి ఇతర రాష్ట్రాల ప్రజలు, సందర్శిస్తారన్నారు. దర్గా ప్రాంతం అభివృద్ధి చెందితే ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఎవ్వరికి నష్టం జరగకుండా ఈ ప్రాంతన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజలు గౌరవించే విధంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. ప్రాంత అభివృద్ధికి కేసీఆర్ 50 కోట్లు మంజూరు చేసారని, అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని, కోరుకుంటారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు జేపీ దర్గా పట్ల ప్రత్యేక అభిమానం ఉందన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి అసౌకర్యం కలగ కుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.