Home / TELANGANA / రానున్న పురపాలక ఎన్నికల్లో టీఆర్ఎస్ దే గెలుపు..!!

రానున్న పురపాలక ఎన్నికల్లో టీఆర్ఎస్ దే గెలుపు..!!

తెలంగాణ రాష్ట్రంలో జనవరి నెలలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీదే అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ రోజు మంగళవారం కరీంనగర్ జిల్లా చొప్పదండి లో జరిగిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తల మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ “మున్సిపాలిటీల్లో శానిటేషన్ కార్యక్రమాలు, విద్యుత్ సమస్యలు, పచ్చదనం పరిశుభ్రత కార్యమాలను తెరాస నాయకుల వెంటపడి మరి పూర్తి చేయించాము.మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఏ రాజకీయ పార్టీ చేయలేదు.కేసీఆర్ లాంటి గొప్ప మనసున్న ముఖ్యమంత్రి ఏ రాష్ట్రం లో లేడు. ప్రజల గుండెల్లో నుండి పుట్టిన నాయకులు మా కేసీఆర్ గారు,మంచి పరిపాలన అందిస్తున్న తెరాస పార్టీ కి ఓటు వేయాలి..తెరాస నాయకులు కలిసి కట్టుగా పనిచేసి విజయం సాధించి మున్సిపల్ ఎన్నికల్లో టి.ఆర్.ఎస్ జెండా ఎగురవేయాలి.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమన్నరు మంత్రి గంగుల కమలాకర్.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, లైబ్రరీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat