రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఏకపక్ష విజయం సాధిస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ మంత్రి పెద్దపల్లి జిల్లాలో పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. మొదట పెద్దపల్లి మున్సిపాలిటీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తిరుగుండదని తెలిపారు. పార్టీ ఏకపక్ష విజయం సాధించడం ఖాయమని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త, పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థి విజయానికి కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఓటర్లకు తెలియజెప్పాలని మంత్రి కార్యకర్తలకు తెలిపారు.
