గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. అందుకే గీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకుని చెట్టుపన్నురద్దుచేసిందన్నారు. కల్లుగీత కార్మిక సంఘం 2020 నూతన కేలండర్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికుల సక్షేమం కోసం లైసెన్స్ గడువును పది సంవత్సరాలకు పెంచామన్నారు. అలాగే హరితహారంలో ఈత తాటి చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం, చనిపోయిన కుటుంబాలకు రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంతో పాటు నీరా పాలసీని ప్రకటించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అనారు. గౌడ కులస్తుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. కల్లుగీత కార్మిక సంఘం నాయకులు తీసుకు వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.