ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహామ్మారి కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరికీ తెలంగాణలో కరోనా సోకలేదని.. విదేశాల నుంచి వచ్చేవారికే కరోనా ఉన్నట్టు తేలిందని చెప్పారు. కరోనా విషయంలో ఎలాంటి భయాందోళనలు అవసరంలేదన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో పాటు… చెస్ట్, ఫీవర్ ఆస్పత్రుల్లో ఐసోలేటెడ్ వార్డులు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో ఆస్పత్రిలో 40 పడకలు ఉన్నాయని తెలిపారు. అటు… మిలటరీ ఆస్పత్రిలో 100 పడకలతో ఐసోలేటెడ్ వార్డు ఏర్పాటు చేశామన్నారు. కరోనా వైరస్ కారణంగా తెలంగాణలో ఎవరూ చనిపోలేదని స్పష్టం చేశారు. కరోనా వైరస్ లక్షణాలు ఉంటే వెంటనే స్పందించాలని మంత్రి ఈటెల కోరారు. దగ్గు, జలుపు, జ్వరం తగ్గకుండా ఉంటే… వెంటనే ఆస్పత్రికి వెళ్లి చెకప్ చేయించుకోవాలని సూచించారు.
