భాగ్యనగరంలో ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకరికి రావడంతో అందరూ భయబ్రాంతులకు గురవురుతున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా మరో ఇద్దరికీ ఈ వ్యాధి సోకినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో బాగంగానే ఒకరు మైండ్ స్పేస్ 20వ అంతస్తులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా అనుమానిస్తున్నారు. దాంతో అందులో స్టాఫ్ అందరికి ఇంటికి వెళ్ళిపోమని చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలను మూసివేస్తున్నారని..ఇక నుంచి ఇంటిదగ్గర నుండే వర్క్ చెయ్యాలని ఆదేశించినట్లు తెలుస్తుంది.
