రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకానికి రూ. 333.29 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు అయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే రూ. 1350.61 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం విడుదలైన నిధులతో కలిపి 2019-20లో రైతుబంధు పథకానికి రూ.1683.90 కోట్లు విడుదలయ్యాయి.
