రాష్ట్ర వార్షిక బడ్జెట్(2020-21) ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు నేడు శాసనసభలో ప్రవేశపెట్టారు. మంత్రి హరీష్‌రావు తొలిసారిగా సభలో బడ్జెట్ ప్రంసంగాన్ని చదివి వినిపించారు. ఇక శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ. 1,82,914.42 కోట్లతో బడ్జెట్ రూపొందించారు. ఆర్థికమాంద్యం నేపథ్యంలో వాస్తవిక దృక్పథంతో 2020-21 బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. . అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్దే లక్ష్యంగా వాస్తవిక కోణంలో బడ్జెట్ రూపొందించినట్టు హరీష్ తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ‘బడ్జెట్ అంటే కాగితాల లెక్కలు కాదు.. సామాజిక స్వరూపం’అని మంత్రి వ్యాఖ్యానించారు. ఆర్థిక మంత్రి హోదాలో హరీష్‌రావు తొలిసారి శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా.. మండలిలో శాసనసభా వ్యవహా రాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు.
తెలంగాణ వార్షిక బడ్జెట్ – 2020-21
* మొత్తం బడ్జెట్ – రూ. 1,82,914.42 కోట్లు
- రెవెన్యూ వ్యయం – 1, 38, 669.82/- కోట్లు
- క్యాపిటల్ వ్యయం – 22,061.18/- కోట్లు
- రెవెన్యూ మిగులు – 4,482.12/- కోట్లు
- ఆర్థిక లోటు – 33,191.25/- కోట్లు
- తలసరి ఆదాయం – 2,28,216/- కోట్లు
వ్యవసాయ రంగం
- రైతుబంధు కోసం – రూ. 14,000 /- కోట్లు
- రైతు బీమా కోసం – రూ. 1,141/- కోట్లు
- రైతు రుణమాఫీ కోసం – రూ. 6225/- కోట్లు
- మైక్రో ఇరిగేషన్ కోసం – రూ. 600/- కోట్లు
- రైతు మద్దతు ధర కోసం – రూ. 1000/- కోట్లు
- రైతు వేదికల నిర్మాణం కోసం – రూ. 350 /- కోట్లు
- పాడి రైతుల ప్రోత్సాహం కోసం – రూ. 100/- కోట్లు
- విత్తనాల సబ్సిడీ కోసం – రూ. 142/- కోట్లు
- బిందు, తుంపర సేద్యం కోసం – రూ. 600/- కోట్లు
- మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కోసం – రూ.. 1000/- కోట్లు
సంక్షేమరంగం
- రూ.40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు
- ఆసరా పెన్షన్లకు – రూ. 11,758/- కోట్లు
- ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధికి – రూ. 16,534.97/- కోట్లు
- ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధికి – రూ. 9,771.27/- కోట్లు
- మైనార్టీల అభివృద్ధి /సంక్షేమానికి – రూ. 1,518.06/- కోట్లు
- ఎంబీసీల సంక్షేమానికి – రూ.500/- కోట్లు
- మత్స్యకారుల సంక్షేమానికి – రూ.1586/ కోట్లు
- కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కోసం – రూ. 350/- కోట్లు
సాగునీటి రంగం
- సాగునీటి రంగానికి – రూ.11,054 కోట్లు
- చిన్న నీటిపారుదలశాఖకు – రూ.600 కోట్లు
- మూసీ రివర్ ప్రాజెక్ట్ కోసం – రూ.10 వేల కోట్లు
ఎస్సీ, ఎస్టీ సంక్షేమం
* ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధికి – రూ. 16,534.97/- కోట్లు
* ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధికి – రూ. 9,771.27/- కోట్లు
* ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఓవర్సీస్
స్కాలర్‌షిప్ కోసం – రూ.20,00,000/- ఆర్థికసాయం
* ఎస్సీ, ఎస్టీ గృహావసరాల కోసం – 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
* ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ రుణాలు,
మైక్రో ఇరిగేషన్ కోసం సబ్సిడీ రెట్టింపు
* మార్కెట్ ఛైర్మన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు
* ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు
రూ.338 కోట్ల పారిశ్రామిక రాయితీలు
బీసీల సంక్షేమం
* వెనుకబడిన వర్గాల కోసం – రూ. 4,356.82/- కోట్లు
* ఎంబీసీల సంక్షేమానికి – రూ.500/- కోట్లు
* మత్స్యకారుల సంక్షేమానికి – రూ.1586/- కోట్లు
* -కల్యాణలక్ష్మి – బీసీల కోసం
అదనపు నిధుల కింద రూ. 1,350/ కోట్లు
* ఇప్పటి వరకు 76 లక్షల 92 వేల 678 గొర్రెల పంపిణీ
* మరో 70 లక్షల 88 వేల గొర్రె పిల్లల ఉత్పత్తి
గీత కార్మికుల సంక్షేమం
* ప్రమాదవశాత్తు చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు రూ. 6 లక్షల పరిహారం
* హరితహారంలో భాగంగా ఈత, తాటి వనాల పెంపకం
* గీత కార్మికుల ఆదాయం పెంచేందుకు ప్రత్యేక పాలసీ
* శీతల పానీయంగా నీరా అమ్మకం
* గీత కార్మికుల చెట్టు పన్ను, పాత బాకీల రద్దు
విద్యారంగం
* పాఠశాల విద్య కోసం – రూ. 10,421/- కోట్లు
* ఉన్నత విద్య కోసం – రూ.1,723/- కోట్లు
* సంపూర్ణ అక్షరాస్యత కోసం – రూ.100/- కోట్లు
* ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం – రూ.2,650/- కోట్లు
* వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి 71 మైనార్టీ జూనియర్ కాలేజీలు
వైద్య రంగం
* వైద్య రంగానికి – రూ. 6,186/- కోట్లు
* 40 ప్రభుత్వాస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు
విద్యుత్ రంగం
* విద్యుత్ శాఖకు * రూ. 10,416/- కోట్లు
* రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం మనది
* తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 1,896 యూనిట్లు
* దేశంలో తలసరి విద్యుత్ వినియోగం 1,181 యూనిట్లు
మున్సిపాలిటీలు
* మున్సిపల్ శాఖకు – రూ. 14,809/- కోట్లు
*పట్టణ మిషన్ భగీరథ పథకం కింద – రూ. 800/- కోట్లు
మిగిలిపోయిన 38 మున్సిపాలిటీలకు
* హైదరాబాద్ నగరంలో ప్రాజెక్టుల – రూ. 10,000/- కోట్లు
అమలు కోసం
డ్వాక్రా సంఘాలు
* మహిళా స్వయం సహకార సంఘాలకు – రూ. 1,200/- కోట్లు
వడ్డీ లేని రుణాల కింద
* రోడ్లు, భవనాల శాఖ
రూ. 3,494/- కోట్లు
పారిశ్రామికరంగం
-పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం – రూ. 1,998/- కోట్లు
-ఇండస్ట్రీయల్ ఇన్సెంటివ్స్ కోసం – రూ. 1,500/- కోట్లు
* టీఎస్ ఐపాస్‌తో 12,427 పరిశ్రమలకు అనుమతి
* టీఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రానికి రూ.2,04,000/- కోట్ల పెట్టుబడులు
* టీఎస్ ఐపాస్ ద్వారా 14 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి
* టీఎస్ ప్రైమ్ పేరుతో మైనార్టీ పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహం
ఐటీ రంగం
* లక్షా 9 వేల కోట్లకు ఐటీ ఎగుమతులు పెరిగాయి
* మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకంగా వీ-హబ్
పోలీస్ శాఖ
రూ. 5,852/- కోట్లు
* కలెక్టరేట్లు, డీపీవోలు, పోలీసు కమాండ్ కంట్రోల్
సెంటర్ నిర్మాణాలను పూర్తి చేయడం కోసం రూ. 550 కోట్లు
పంచాయతీరాజ్
* పంచాయతీరాజ్/ గ్రామీణాభివృద్ధి కోసం – రూ. 23,500/- కోట్లు
* గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కోసం – రూ.600/- కోట్లు
* పంచాయతీల్లో 36 వేల పారిశుద్ధ్య కర్మచారుల వేతనం రూ.8,500 కి పెంపు
గృహ నిర్మాణం
* గృహ నిర్మాణాల కోసం – రూ.11,917/- కోట్లు
* వివిధ దశల్లో 2,72,763 డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం
* సొంత స్థలం కలిగిన పేదలు ఇల్లు నిర్మించుకోడానికి ఆర్థికసాయం
ఆర్టీసీ రంగం
* ఆర్టీసీ బలోపేతానికి – రూ.1000/- కోట్లు
* ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎంప్లాయిస్ బోర్డు
* ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెంపు
* ఆర్టీసీలో కార్గో, పార్సిల్ సర్వీసును ప్రారంభం
దేవాలయాలు
* దేవాలయాల అభివృద్ధికి – రూ.500/- కోట్లు
* దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం – రూ.50/- కోట్లు
-హైదరాబాద్ నగరంలో ప్రాజెక్టుల
అమలు కోసం
* రూ. 10,000/- కోట్లు
-పర్యావరణ, అటవీశాఖ
రూ. 791/- కోట్లు
* కలెక్టరేట్లు, డీపీవోలు, పోలీసు కమాండ్ కంట్రోల్ – రూ. 550/- కోట్లు
సెంటర్ నిర్మాణాలను పూర్తి చేయడం కోసం
-ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఎన్డీపీ నిధుల కోసం రూ. 480/- కోట్లు
హరితహారం
రూ. 791/- కోట్లు
రోడ్లు, భవనాల శాఖ
రూ. 3,494/- కోట్లు