ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వైరస్ గురించి తెలియనివారు లేరు. కరోనా అంటేనే అందరూ పారిపోతుంటే తాజాగా చైనా అధ్యక్షుడు కరోనా ఉద్భవించిన వూహాన్ నగరంలో మొట్టమొదటిసారి పర్యటించారు. హుబే ప్రావిన్సు పరిధిలోని వూహాన్ నగరంలో కరోనా వైరస్ ఉద్భవించింది. ఈనేపధ్యంలో కరోనా నియంత్రణకు వైద్యాధికారులు తీసుకున్న చర్యలను జిన్‌పింగ్ పరిశీలించారు. అలాగే ఈ వైరస్ నియంత్రణ కోసం శ్రమించిన వైద్యఆరోగ్యశాఖ కార్యకర్తలు, మిలటరీ అధికారులు, సైనికులు, కమ్యూనిటీ వర్కర్లు, పోలీసు అధికారులు, అధికారులు, వాలంటీర్లు, కరోనా వైరస్ రోగులు, వూహాన్ వాసులను జిన్ పింగ్ ప్రశంసించారు. జిన్ పింగ్ వెంట కమ్యూనిస్టు పార్టీ చైనా సెంట్రల్ కమిటీ సభ్యులు, సెంట్రల్ మిలటరీ కమిషన్ ఛైర్మన్ తదితరులున్నారు. అయితే వైరస్ వచ్చిన వ్యక్తులంటే పారిపోతున్నతరుణంలో ఏకంగా ఆ దేశాధ్యక్షుడే వైరస్ ప్రభావిత ప్రాంతంలో పర్యటించడంపట్ల ఆయనను అందరూ అభినందిస్తున్నారు.
